: ప్రముఖ నటి కల్పనా రంజని కన్నుమూత


ప్రముఖ మలయాళ నటి కల్పనా రంజని కొద్ది సేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 50 సంవత్సరాలు. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నాగార్జును, కార్తీ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న 'ఊపిరి' చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. వెంకటేష్ హీరోగా తెలుగులో వచ్చిన 'ప్రేమ' చిత్రంలో నటించిన ఆమె, 'సతీ లీలావతి' చిత్రంలో కమల్ స్నేహితుడి భార్యగా తనదైన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆపై 'బ్రహ్మచారి' తదితర చిత్రాల్లో నటించారు. ఉత్తమ సహాయనటిగా పురస్కారాన్ని కూడా పొందారు. ఆమె మృతిపట్ల దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News