: బండెనక బండి ఢీకొట్టి!... యమునా ఎక్స్ ప్రెస్ వేపై ఢీకొట్టుకున్న 50 కార్లు


‘బండెనక బండి కట్టి...’ పాట మనకు తెలుసు. బండెనక బండి ఢీకొట్టి... అనే కొత్త మాట యుమునా ఎక్స్ ప్రెస్ వేకు పరిపాటిగా మారింది. దేశంలోని హైస్పీడ్ రహదారుల్లో పేరెన్నికగన్న యమునా ఎక్స్ ప్రెస్ వే పై కార్లు వంద మైళ్ల వేగంతో దూసుకెళుంటాయి. లెక్కకు మిక్కిలి లేన్లు ఉన్న ఈ రహదారిపై ప్రమాదం జరిగిందంటే, ఏ రెండు వాహనాలో దెబ్బ తినవు. పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బ తినాల్సిందే. నేటి ఉదయం కూడా ఈ తరహా ప్రమాదమే చోటుచేసుకుంది. పొగమంచుతో కప్పబడిన సదరు రహదారిపై జీరో విజిబిలిటీ రాజ్యమేలుతోంది. అయినా ప్రయాణికులు మాత్రం ఆ రోడ్డుపై ప్రయాణం చేస్తూనే ఉన్నారు. నేటి ఉదయం ముందుగా వెళుతున్న ట్రక్కును గుర్తించలేని ఓ డ్రైవర్ తన కారును దానితో ఢీకొట్టాడు. వెనువెంటనే ఆ కారును మరో కారు.., దానిని మరో కారు... అలా మొత్తం 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News