: యువరాజ్ సింగ్ రేటు రూ. 2 కోట్లు
ఫిబ్రవరి 6న బెంగళూరులో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. వేలం కోసం మొత్తం 714 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇటీవల వివిధ ఫ్రాంచైజీలు విడుదల చేసిన 61 మందిపైనే అందరి కళ్లూ ఉన్నాయి. వీరిలో 12 మంది కనీస ధరను రూ. 2 కోట్లుగా ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించింది. గత సీజన్ లో అత్యధిక ధర పలికి, ఆపై మైదానంలో ఘోర వైఫల్యంతో జట్టుకు దూరమైన యువరాజ్ సింగ్ కనీస విలువ రూ. 2 కోట్ల జాబితాలో ఉన్నాడు. యువీతో పాటు పీటర్సన్, ఇషాంత్, వాట్సన్, మిషెల్ మార్ష్, ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణిలు ఇదే బేస్ ప్రైస్ రేంజ్ లో ఉండగా, రూ. 1.5 కోట్ల జాబితాలో డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జాస్ బట్లర్ లు, రూ. కోటి రేంజ్ లో ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌథీలు ఉన్నారు. పుణె, రాజ్ కోట్ రూపంలో రెండు కొత్త జట్లు పోటీలో ఉండటంతో, ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నారు.