: ఎంఎస్ నారాయణ ఇంట మరో విషాదం... ఎంఎస్ సతీమణి కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, దివంగత ఎంఎస్ నారాయణ ఇంట ఏడాది వ్యవధిలోనే మరో విషాదం చోటుచేసుకుంది. ఎంఎస్ సతీమణి కళాప్రపూర్ణ (63) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కళాప్రపూర్ణ తుది శ్వాస విడిచారు. భర్త ప్రథమ వర్ధంతి జరిగిన రెండు రోజులకే ఆమె చనిపోయారు.