: రోహిత్ తల్లికి ఛాతీ నొప్పి... కాంటినెంటల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స


ఆత్మహత్యకు పాల్పడ్డ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 17న వర్సిటీలో చోటుచేసుకున్న రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెను కలకలానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖుల పరామర్శలు, విద్యార్థుల ఆందోళనలతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కుమారుడి ఆత్మహత్యతో నాటి నుంచి తీవ్రంగా రోదిస్తున్న రోహిత్ తల్లి రాధిక నిన్న ఛాతీ నొప్పికి గురయ్యారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోని ఐసీయూలో రాధికకు చికిత్స జరుగుతోంది.

  • Loading...

More Telugu News