: హైదరాబాద్ లో పూర్తి వైఫై సేవలందిస్తాం: టీడీపీ-బీజేపీ నేతలు
హైదరాబాద్ లో పూర్తి వైఫై సేవలందిస్తామని బీజేపీ, టీడీపీ నేతలు పేర్కొన్నారు. ‘హ్యాపీ హైదరాబాద్’ పేరిట బీజేపీ-టీడీపీ సంయుక్త విజన్ డాక్యుమెంట్ ను ఈరోజు విడుదల చేశారు. ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా, పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ చేపట్టడం, యువత, మహిళలకు ఉపాధి రుణాలు, ప్రతి డివిజన్లో రూ.5కే భోజనం వంటి సదుపాయాలు ప్రజలకందిస్తామని ఆ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.