: మన నగరాల్లో సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది... హైదరాబాద్ లో కూడా!
ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాలో మన దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి చేరిపోయాయి. ఈ దేశాల్లో అత్యధిక ధనవంతులున్న నగరాలపై వెల్త్ నివేదిక - 2016 లో ఈ విషయాన్ని పేర్కొంది. తాజాగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం, గత పదిహేనేళ్లలో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో సంపన్నుల సంఖ్య 300 శాతానికి పెరిగిపోయింది. 41,200 మంది సంపన్నులతో ముంబయి 12వ స్థానంలో, 20,600 మంది సంపన్నులతో 20వ స్థానంలో ఢిల్లీ నిలిచాయి. కాగా, మొదటి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. 2.64 లక్షల మంది మిలియనీర్లు టోక్యోలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్ లో 510 మంది మిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది.