: మలేషియా మాస్టర్ టోర్నీని రెండోసారి గెలుచుకున్న సింధు
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ గ్రాండ్ ప్రీ టోర్నీ చాంపియన్ గా పీవీ సింధు నిలిచింది. ఈ టోర్నీని ఆమె దక్కించుకోవడం ఇది రెండోసారి. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఫైనల్ లో స్కాట్ లాండ్ కు చెందిన గిల్ మోర్ పై వరుస సెట్లలో సింధు విజయం సాధించింది. 21-15, 21-9 తేడాతో రెండు సెట్లను నెగ్గిన సింధు చాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. 2013లో సింధు ఇదే టైటిల్ ను తొలిసారి గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆమె విజయం సాధించడం పట్ల ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ శుభాకంక్షలు తెలిపింది.