: ఎంపీ రాయపాటి క్యాంపులో రూ. 5 లక్షల చోరీ


పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో చోరీ జరుగగా, రూ. 5 లక్షల డబ్బు మాయమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విజయవాడ, భారతీ నగర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో రాయపాటి క్యాంపును నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే ఉదయాన్నే అక్కడికి వెళ్లిన సిబ్బంది, ప్రధాన ద్వారం, లోపలి బీరువా తెరచి వుండటాన్ని గమనించారు. ఆపై ఆఫీస్ మేనేజర్ శాస్త్రి వచ్చి పరిశీలించి, ఓ ల్యాప్ టాప్, రూ. 5 లక్షలు పోయాయని గుర్తించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఇది ఇంటి దొంగల పనేనని భావిస్తున్న పోలీసులు, కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News