: 'మీ యుద్ధ ఖైదీ'... అంటూ నేతాజీపై నెహ్రూ లేఖ!
1945, డిసెంబర్ 27న జవహర్ లాల్ నెహ్రూ రాసినట్టుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ల మధ్య విభేదాలు ఉన్నాయని గుర్తు చేస్తోంది. అప్పటి ఇంగ్లండ్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి నెహ్రూ రాసిన లేఖలో సుభాష్ చంద్రబోస్ ను యుద్ధ ఖైదీగా నెహ్రూ అభివర్ణించారు. "డియర్ మిస్టర్ అట్లీ..." అంటూ ప్రారంభమైన లేఖలో, తనకున్న సమాచారం మేరకు 'మీ యుద్ధ ఖైదీ' స్టాలిన్ ప్రోద్బలంతో రష్యాలోకి ప్రవేశించాడని తెలిపారు. రష్యన్లు నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖ, కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించవచ్చని భావిస్తున్నారు.