: నేడు పున్నమి... తిరుమలలో గరుడసేవకు పోటెత్తుతున్న భక్తులు


నిండు పున్నమి నాడు... ఆ చల్లని వెన్నెలలో తన ప్రధాన వాహనం గరుత్మంతుడిపై ఆ శ్రీనివాసుడు ఊరేగనున్న వేళ చూసేందుకు ఎన్ని కళ్లైనా చాలవు. నేడు పౌర్ణమి కావడంతో సాయంత్రం జరిగే పున్నమి గరుడ సేవను తిలకించేందుకు గత రాత్రి నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తుండగా, సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. గరుడసేవకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. శనివారం నాడు శ్రీవారిని 75,058 మంది భక్తులు దర్శించుకున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News