: నాన్న పరుగులు.. కూతురు కేరింతలు!


‘గో డాడీ గో’ అంటూ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిన్నకూతురు తన తండ్రిని ఉత్సాహపరిచింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు జరిగిన ఆఖరి వన్డే లో ఆసిస్ తరపున డేవిడ్ వార్నర్ మొదట బ్యాటింగ్ చేశాడు. తన తండ్రి చెలరేగి ఆడటాన్ని ఇంట్లో టీవీలో చూస్తూ కూర్చుంది ఐవీ మే. వార్నర్ ఫోర్లు బాదుతుంటే.. నవ్వులు చిందిస్తూ చూస్తున్న ఐవీ ‘గో డాడీ గో’ అంటూ తన తండ్రిని ఉత్సాహపరిచింది. ఇదంతా గమనిస్తున్న ఐవీ తల్లి ఒక ఫొటో తీసి దానిని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పలువురిని ఆకట్టుకుంటోంది. చెలరేగి ఆడిన వార్నర్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 బంతుల్లోనే వందపరుగులు పూర్తి చేశాడు.

  • Loading...

More Telugu News