: హెచ్ సీయూలో విద్యార్థుల నిరాహారదీక్ష భగ్నం!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థుల నిరాహారదీక్షను వర్శిటీ భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. దీక్షకు దిగిన ఏడుగురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, దీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల దీక్షను భగ్నం చేసేందుకు వర్శిటీ భద్రతా సిబ్బంది యత్నించింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.