: నేతాజీని జాతి నాయకుడిగా గుర్తించాలి: మమతా బెనర్జీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 100 రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేసిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ ప్రకటన చేశారు. ఆయనను జాతి నాయకుడిగా గుర్తించాలని పేర్కొన్నారు. బోస్ జాతి నాయకుడి గౌరవానికి అన్ని విధాల అర్హులు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మోదీ విడుదల చేసిన దస్త్రాల ద్వారా నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయని, భావితరాలకు ఆయన గురించిన నిజాలను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మమత చెప్పారు.