: తండ్రి కష్టాన్ని గుర్తించిన అక్షయ్ కుమారుడు!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమారుడు ఆవర్ తండ్రి కష్టాన్ని గుర్తించాడు. తన తాజా చిత్రం 'ఎయిర్ లిఫ్ట్'ను కుటుంబ సభ్యులతో కలసి అక్షయ్ వీక్షించాడు. ఈ సినిమా చూసిన తరువాత ఆయన కుమారుడు ఆవర్ తన తల్లి (ట్వింకిల్ ఖన్నా) దగ్గరకు వెళ్లి "అమ్మా! నాన్న చాలా కష్టపడుతున్నాడు. సినిమా చూసిన తరువాత ఆ విషయం అర్ధమైంది' అని అన్నాడట. ఈ విషయం ట్వింకిల్ ఖన్నా తన ట్విట్టర్ ద్వారా తెలిపి, సినిమా వీక్షించిన తరువాత తీసుకున్న ఫోటోను పోస్టు చేసింది. కాగా, కువైట్ యుద్ధం సందర్భంగా వేలాది మంది భారతీయులను తరలించిన యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.