: కేసీఆర్ వల్లే తనను ఇంట్లో బాగా చూసుకుంటున్నారని ఆ బామ్మ చెప్పారు: కేటీఆర్


తమకు కేసీఆర్ పెద్దకుమారుడు లాంటివారని, ఆయన వల్లే పింఛన్, రేషన్ అన్నీ సక్రమంగా అందుతున్నాయని, దీంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను బాగా చూసుకుంటున్నారని గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నాగోలులో కలిసిన ఓ బామ్మ తనతో అన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులోని కొత్తపేటలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక సీమాంధ్రులను వెళ్లగొడతారని అన్నారని, అలా జరగలేదని పేర్కొన్నారు. తమది స్టేట్ ఫైట్ అని స్ట్రీట్ ఫైట్ కాదని ఆనాడే చెప్పామని ఆయన అన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని అప్పడే చెప్పామని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే పింఛన్లు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. రెండేళ్ల కిందటి పరిస్థితికి, ఇప్పటికి తేడా గుర్తించాలని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ, హైదరాబాదు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News