: కశ్మీరీ పండిట్ కుటుంబానికి అండగా నటుడు అనుపమ్ ఖేర్


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కశ్మీరీ పండిట్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లకు ఎలాంటి అవసరం వచ్చినా తానున్నానని హామీ ఇచ్చాడు. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదానికి భయపడి, చాలా మంది కశ్మీరీ పండిట్లు చెల్లాచెదురైపోయారు. అయితే, అటువంటి పరిస్థితులలోను ఇప్పటికీ కొన్ని పండిట్ కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయి. అలా నివసిస్తున్న వారిలో అశోక్ కుమార్ రైనా కుటుంబం కూడా ఉంది. ఆర్థికంగా చితికిపోయిన ఆయన తన కుటుంబాన్ని పోషించుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఓ రోజు తన కష్టాలను ఓ విలేకరి ద్వారా తెలియజేయడంతో అది తెలుసుకున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చలించిపోయాడు. వెంటనే అతని కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని, అశోక్ పెద్ద కుమార్తెకు తానే పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. అన్నట్టు అనుపమ్ ఖేర్ కూడా కశ్మీరీ పండిట్టే!

  • Loading...

More Telugu News