: ఝార్ఖండ్ లో 293 అడుగుల ఎత్తైన జెండా ఆవిష్కరణ
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పహారీ మందిర్ లో దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆవిష్కరించారు. 66 మీటర్ల పొడవు, 99 మీటర్ల వెడల్పుతో 293 అడుగుల ఎత్తులో ఈ జెండా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా ఈ జెండాను ఆవిష్కరించామని పారికర్ తెలిపారు. జెండా ఆవిష్కరణకు తనను ఆహ్వానించినందుకు ఝార్ఖండ్ సీఎం రఘుబిర్ దాస్ కు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది హర్యానాలోని ఫరీదాబాద్ లో 250 అడుగుల ఎత్తైన జెండాను రూపొందించారు. తాజాగా ఝార్ఖండ్ లో రూపొందించిన జెండా దానికంటే 43 అడుగుల ఎత్తు ఎక్కువగా ఉండటం విశేషం.