: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా


టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించిన ఓపెనర్లు కుదురుకున్నాక జోరందుకున్నారు. శిఖర్ ధావన్ ధాటైన ఆటతీరుతో బంతిని బౌండరీ లైన్ దాటించాడు. స్కోరు బోర్డుకు మరింత వేగం తెప్పించే క్రమంలో భారీ షాట్ కు యత్నించిన ధావన్ షాన్ మార్ష్ అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. క్రీజులో రోహిత్ శర్మ (46) నిలదొక్కుకోగా, విరాట్ కోహ్లీ (8) హేస్టింగ్స్ వేసిన అద్భుతమైన బంతికి కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 20 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేస్టింగ్స్ రెండు వికెట్లతో రాణించాడు.

  • Loading...

More Telugu News