: టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్


బీజేపీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ టీఆర్ఎస్ లో చేరారు. నేడు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాథోడ్ తో పాటు పలువురు అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన శేరిలింగంపల్లి టీడీపీ నేత బండి రమేశ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు.

  • Loading...

More Telugu News