: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్ఐఏ తనిఖీలు... మరో 13 మంది అరెస్టు
గణతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ 6 నగరాల్లోని 12 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు మరో 13 మందిని అరెస్టు చేశారు. ఇటీవల అరెస్టయిన ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ముంబయిలో పట్టుబడిన అనుమానిత వ్యక్తి భారత్ లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. నిన్న(శుక్రవారం) నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు 14 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.