: ఖో-ఖో ఆటలో ఢీకొన్న విద్యార్థులు... ఓ విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపటి క్రితం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో నిర్వహించిన ఖో-ఖో క్రీడలో భాగంగా ఇద్దరు విద్యార్థులు బలంగా ఢీకొన్నారు. దీంతో భద్రాచలం అనే విద్యార్థి అక్కడే కుప్పకూలిపోయాడు. వెనువెంటనే స్పందించిన పాఠశాల ఉపాధ్యాయులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే భద్రాచలం కన్నుమూశాడు. ఉత్సాహంగా సాగుతున్న క్రీడలో మరింత ఉత్సాహంతో కూత పెడుతున్న భద్రాచలం చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.