: నిజామాబాద్ జిల్లాలో పురాతన స్పటిక శివలింగం అపహరణ


నిజామాబాద్ జిల్లాలో అతి పురాతన స్పటిక శివలింగాన్ని దొంగలు చోరీ చేశారు. జిల్లాలోని నవీపేట మండలం ఎంచ గ్రామంలో మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కేదారీశ్వరి ఆలయం ఉంది. అందులోని పానవట్టంపై ఉన్న లింగం గత అర్ధరాత్రి అపహరణకు గురైంది. ఈ ఉదయం ఆలయ పూజారి వచ్చి చూడగా స్పటిక లింగం కనిపించలేదు. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆలయాన్ని పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News