: ఇక సెలవు... జెంటిల్మన్ గేమ్ కు గుడ్ బై చెప్పిన విండీస్ క్రికెటర్ చందర్ పాల్


జెంటిల్మన్ గేమ్ క్రికెట్ కు గుడ్ బైల పరంపర కొనసాగుతోంది. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ శివనారాయణ్ చందర్ పాల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు అతడు నిన్న కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు జట్టుకు వెస్టిండిస్ బోర్డు తనను ఎంపిక చేయకపోవడంపై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న చందర్ పాల్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. టెస్టుల్లో 51.37, వన్డేల్లో 41.60 సగటుతో విండీస్ జట్టులో స్టార్ బ్యాట్స్ మన్ గా ఎదిగిన చందర్ పాల్... తన టెస్టు కెరీర్ లో మొత్తం 11,867 పరుగులు చేశాడు. ఈ స్కోరు ఆ దేశ క్రికెట్ లెజెండ్ బ్రయన్ లారా కంటే కేవలం 87 పరుగులు మాత్రమే తక్కువట.

  • Loading...

More Telugu News