: భాగ్యనగరమంతా ఉచిత వై-ఫై... టీఆర్ఎస్ ‘గ్రేటర్’ మేనిఫెస్టో రిలీజ్


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మేనిఫెస్టో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. పార్టీ సీనియర్లు కె.కేశవరావు, డి.శ్రీనివాస్ లు పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 30న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారని తెలిపారు. ఇక మేనిఫెస్టోలోని అంశాల విషయానికొస్తే... 1. నగర వ్యాప్తంగా ఉచిత వై-ఫై సదుపాయం 2. నగరంలో కొత్త పార్కులు 3. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే తరహాలో కొత్త స్టేడియాలు 4. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులకు సింగిల్ విండో విధానం 5. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు 6. ఏడాది చివరి నాటికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి 7. రూ.130 కోట్లతో 200 ఆదర్శ మార్కెట్లు 8. రవీంధ్ర భారతి ఆధునికీకరణ 9. రియల్ ఎస్టేట్ సంస్థలకు నాలా పన్ను మినహాయింపు 10. ఇంకుడు గుంతలకు ప్రభుత్వ ప్రోత్సాహం 11. దుర్గం చెరువులో సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏర్పాటు 12. మార్కెట్లలో ఫార్మసీ, ఏటీఎం, ఫుడ్ కోర్టులు, మాంసం ఉత్పత్తులు 13. సర్కారీ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూంలు 14 నగర రోడ్లన్నిటికీ వైట్ టాపింగ్ 15. నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా

  • Loading...

More Telugu News