: శ్రీనివాస్ నిజంగానే స్పీడున్నోడు: తమన్నా
'స్పీడున్నోడు' సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగానే 'స్పీడున్నోడ'ని సినీ నటి తమన్నా తెలిపింది. 'స్పీడున్నోడు' సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీనివాస్ 'అల్లుడు శీను' సినిమా చేయకముందే తనకు తెలుసని, శ్రీనివాస్ చేసిన డాన్స్ ల వీడియోస్ ఆయన తండ్రి చూపించారని, వాటిని చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ఈ సినిమా టైటిల్ కు శ్రీనివాస్ న్యాయం చేశాడని చెప్పింది. ఈ సినిమాలో అద్భుతమైన డాన్సులు, ఫైట్లు, నటన చూపించిన శ్రీనివాస్ అందర్నీ ఆకట్టుకుంటాడని తమన్నా తెలిపింది. రెండో సినిమాకే ఇంత ప్రతిభ చూపిస్తున్న శ్రీనివాస్ నిజంగా 'స్పీడున్నోడ'ని పేర్కొంది. తనకు అతనితో ఇది రెండో స్పెషల్ సాంగ్ అని చెప్పిన తమన్నా, అతనితో డాన్స్ చేయడం ఆస్వాదించానని చెప్పింది.