: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం!
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వద్ద ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అక్కడి నుంచి ఆయన వేరే వాహనం ద్వారా నెల్లూరు వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.