: ఉద్యోగం, డబ్బు అవసరం లేదు.. న్యాయం కావాలి: రోహిత్ తండ్రి
‘నా కొడుకు చచ్చిపోయి అమరుడయ్యాడు. బతికుంటే ఒక సైంటిస్టు అయ్యేవాడు. మహా అయితే అమెరికా వెళ్లేవాడు’ అంటూ రోహిత్ తండ్రి మణికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య విషయంలో తమకు న్యాయం కావాలి తప్పా, ఉద్యోగం, డబ్బు అవసరం లేదని అన్నారు. కొడుకు సస్పెండ్ అయిన విషయం తనకు తెలియదని చెప్పారు. రాధిక, తమ చిన్న కొడుకు హైదరాబాద్ వచ్చి సుమారు 20 రోజులు అవుతుందని పేర్కొన్నారు. తన కొడుకు ఆత్మహత్య విషయంలో కులంతో సంబంధం లేకుండా న్యాయం చేయాలని మణికుమార్ కోరారు.