: రోహిత్ మృతి విషయం ఆలస్యంగా తెలిసింది: తండ్రి మణికుమార్
రోహిత్ మృతి విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని తండ్రి మణికుమార్ అన్నారు. రోహిత్ ఆత్మహత్య వార్త గురించి తన మిత్రుడికి రాధిక వెంటనే ఫోన్ చేయడం ద్వారా ఈ విషయం తనకు తెలిసిందన్నారు. మనవడి మరణవార్త విషయాన్ని ఆ అర్ధరాత్రి తన తల్లిదండ్రులకు కూడా చెప్పానని మణికుమార్ పేర్కొన్నారు. తాను రోహిత్ తో మాట్లాడి 8 నెలలవుతోందని అన్నారు.