: అమెరికాకు మంచు తుపాన్ హెచ్చరిక.. అత్యవసర పరిస్థితి ప్రకటన
అమెరికాలోని ఐదు రాష్ట్రాలను మంచు తుపాన్ ముంచెత్తనుంది. దీంతో అక్కడి ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 300 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వర్జీనియా నేషనల్ గార్డ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వేలాది విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంబంధిత శాఖాధికారులు ప్రకటించారు. వాషింగ్టన్, బాల్టీమోర్ లో ఈరోజు మధ్యాహ్నం హిమపాతం కురిసినట్లు సమాచారం. వాషింగ్టన్ లో రద్దీగా ఉండే సబ్ వేలను ఈ రోజు రాత్రి నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. న్యూయార్క్ తో పాటు తూర్పు తీర ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయానికి మంచు తుపాన్ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.