: కేటీఆర్, నేను రెడీ...వారం రోజుల్లో వంద డివిజన్లు చుట్టేస్తాం: కవిత


వారం రోజుల్లో గ్రేటర్ పరిధిలోని వంద డివిజన్లను చుట్టేస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ మేరకు హైదరాబాదులోని అన్ని డివిజన్లలోను మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ రెడ్డి, తాను పర్యటించనున్నామని అన్నారు. ఈ సందర్భంగా పలు రోడ్ షోలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. గ్రేటర్ హైదరాబాదును అభివృద్ధి చేస్తే తెలంగాణను అభివృద్ధి చేసినట్టేనని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు ఓటు వేసి, తమ ఓటును వేస్టు చేసుకోవద్దని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News