: హాలీవుడ్ ఆదర్శ జంట విడిపోతోందా?


హాలీవుడ్ లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన జంట విడిపోతోందా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి సమాచార సాధనాలు. హాలీవుడ్ లో ఆదర్శ జంట అనగానే బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ గురించి చెబుతారు. వారిద్దరూ అంతలా అక్కడి వారిని ఆకట్టుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు వైవాహిక జీవితాన్ని అనుభవించిన వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని హాలీవుడ్ లైఫ్.కామ్ తెలిపింది. ఏజెంలినా జోలీ తన సమయాన్ని పిల్లలు, సామాజిక కార్యక్రమాలకు వెచ్చించేందుకే సరిపోతోందని, భార్యగా తనతో గడిపేందుకు సమయం ఉండడం లేదని బ్రాడ్ పిట్ భావిస్తున్నాడని ఆ వెబ్ కథనం పేర్కొంది. అంతే కాకుండా ఏంజెలినాకి ఉన్న వ్యక్తిగత సమస్యల కారణంగా, ఆమె వ్యక్తిగత సమయాన్ని అజ్ఞాతంగా గడిపేందుకే ఇష్టపడుతోందని, దీంతో బ్రాడ్ పిట్ నిరాశ చెందుతున్నాడని, ఈ మేరకు వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారని, త్వరలోనే విడిపోనున్నారని ఆ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News