: ఈ బ్యాంకే కాదు... ఖాతాదారుల రూటూ సెపరేటే!


బ్యాంకు పనిమీద అక్కడికి వెళితే గంట, రెండు గంటలు.. మహా అయితే మూడు గంటల సమయంలో మన లావాదేవీలు ముగించుకుని బయటపడవచ్చు. కానీ, ఈ ప్రైవేటు బ్యాంక్ కి వెళితే మాత్రం అర్ధరాత్రో, అపరాత్రో, లేకపోతే మర్నాడు ఉదయమో ఇంటికి చేరుకుంటాము. ఎందుకంటే, 25-30 గ్రామాల ఖాతాదారులున్న ఈ బ్యాంకుకు సిబ్బంది మాత్రము ముగ్గురే. అందుకే, ఇక్కడి ఖాతాదారులకు అంత సమయం పడుతోంది. ఇంతకీ ఈ బ్యాంకు ఎక్కడుందంటే, మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లా కేంద్రానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలోని సిద్ధి గ్రామంలో ఉంది. ఈ బ్యాంక్ కు వెళ్లే ఖాతాదారులకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... అన్ని గంటల పాటు క్యూలో నిలబడటం కష్టం కనుక వారు నిలబడటానికి బదులు వాళ్ల చెప్పులను లైన్ లో ఉంచుతారు. తమ వంతు రావడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకుని ఆ సమయానికి ఖాతాదారులు అక్కడికి చేరుకుంటారు. మరో గమ్మత్తైన విషయమేమిటంటే... తమ పని ముందుగా పూర్తి చేసుకునేందుకని కొంతమంది ఖాతాదారులు తమ ముందున్న వారికి ఎంతో కొంత డబ్బిచ్చి బ్యాంక్ లోకి వెళుతుంటారు. అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన కొంత మంది గ్రామస్తులు తమకు అవసరం లేకపోయినప్పటికీ బ్యాంక్ క్యూలో తమ చెప్పులను ఉంచడం.. ఎవరైనా పదో పరకో ఇస్తే అది తీసుకుని అక్కడి నుంచి వెళ్లడం పరిపాటయింది.

  • Loading...

More Telugu News