: భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఆవేదన
రాజస్థాన్ లోని జయపుర లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కొద్దిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో అసహనంపై జరిగిన చర్చలో మీరెందుకు భాగస్వాములు కాలేదని మీడియా ప్రశ్నించగా... కరణ్ స్పందిస్తూ, భారతదేశంలో ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ ఉందనేది పెద్ద జోక్ అని పేర్కొన్నారు. ఏదైనా విషయంపై అభిప్రాయాన్ని చెబితే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తానొక సినీ నిర్మాత అయినప్పటికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తనకు లేదని చెప్పారు. 'అంతెందుకు, నేను ఇక్కడి నుంచి వెళ్లోలాగా నాపై కేసు నమోదు అయినా అవ్వచ్చు' అంటూ వ్యాఖ్యానించారు. అందుకే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న అసహనం లాంటి వివాదాలపై తాను పోరాడదలుచుకోలేదన్నట్టు తెలిపారు. ప్రతి విషయంలో కొన్ని హద్దులుంటాయని, సినిమాలలో తాను ప్రస్తావించిన విషయాలపై, సభలలో తాను మాట్లాడిన అంశాలపై ఎక్కడ లీగల్ నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతానని కరణ్ చెప్పుకొచ్చారు.