: నాకూ నాన్న అలవాటు ఉంది... రోజూ రెండు చుట్టలు మాత్రం తాగుతా: బాలకృష్ణ
స్వరం బాగుండటం కోసం తన తండ్రి, దివంగత ఎన్టీఆర్ రోజూ రెండు పొగాకు చుట్టలు తాగేవారని, తనకు కూడా అదే అలవాటైందని, రోజూ రెండు చుట్టలు కాలుస్తానని 'డిక్టేటర్' బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య చిన్న నాటి విశేషాలు కొన్ని చెప్పారు. నాన్నగారు తనను ఎప్పుడూ కొట్టలేదని చెప్పిన బాలయ్య, సినిమాల్లో మినహా, అన్నయ్య హరికృష్టపై కూడా ఎన్నడూ చెయ్యి చేసుకోలేదని గుర్తు చేసుకున్నారు. ఆయన కొట్టకుండానే తమలో క్రమశిక్షణ పెరిగిందని తెలిపారు. ఇక పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన బాలయ్య బాబు, అభిమానులను మాత్రం ఆ అలవాటుకు దూరంగా ఉండాలని చెప్పడం గమనార్హం.