: నిరుద్యోగ భారతం... యూపీలో స్వీపర్ పోస్టులకు ఎంబీయేలు, టెక్కీల పోటీ


ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత డిమాండ్ ఉంటుందన్నదానికి, నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందన్న విషయానికి ఇది మరో ఉదాహరణ. యూపీలోని అమ్రోహా మునిసిపాలిటీలో 114 సఫాయి కర్మచారీ (స్వీపర్) ఉద్యోగాలకు ప్రకటన వెలువరిస్తే, 19 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో అత్యధికం గ్రాడ్యుయేట్ల నుంచి వచ్చినవే. బీఏ, బీఎస్సీ, ఎంఏ, బీటెక్, ఎంబీఏలు చదివిన వారు స్వీపర్ ఉద్యోగాలకు పోటీపడుతున్నారు. ఇంకా మరిన్ని దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తుండగా, ఈ పోస్టులన్నీ వాల్మీకి వర్గానికి కేటాయించాలంటూ స్వీపర్ ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో, నియామక ప్రక్రియ తాత్కాలికంగా ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్మోహా నగర్ పాలికకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ స్వీపర్ పోస్టులకు ఏ విధమైన విద్యార్హతలూ అవసరం లేదని అర్మోహా మునిసిపల్ ఆఫీసు సూపరింటెండెంట్ ఫయీజ్ ఆలమ్ వివరించారు. చీపుర్లు పట్టి వీధులు శుభ్రం చేయడం, మురుగు కాలువల పర్యవేక్షణ తదితరాలు విధులుగా ఉండే ఈ ఉద్యోగులకు నెలకు రూ. 17 వేలు జీతమని, ఆ కారణంగానే పోటీ అధికంగా ఉందని వివరించారు.

  • Loading...

More Telugu News