: మాజీ మంత్రి సర్వేపై పీసీసీ కార్యదర్శి సురేష్ యాదవ్ ఆరోపణలు
గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఏర్పడిన వివాదంతో టి.కాంగ్రెస్ సీనియర్ నేతలపై పలువురు పీసీసీ కార్యదర్శులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై పీసీసీ కార్యదర్శి సురేష్ యాదవ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల క్రమంలో మల్కాజ్ గిరిలోని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని సర్వే తన వద్ద రూ.26 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. కానీ ఆ డివిజన్ టికెట్ తనకు కాకుండా సెటిలర్ కు ఇచ్చారన్నారు. కాబట్టి సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేపు తాను ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.