: గాంధీ భవన్ కు తాళం... టికెట్లు అమ్ముకుంటున్నారంటూ అసంతృప్తుల ఆగ్రహం
కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ శాఖ (టీకాంగ్రెస్) కార్యాలయం గాంధీ భవన్ కు తాళం పడిపోయింది. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి టికెట్లను నేతలు అమ్ముకున్నారంటూ టికెట్లు రాని కొంతమంది కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. అయితే తమ ఆందోళనలను నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో, చిర్రెత్తుకొచ్చిన కార్యకర్తలు గాంధీ భవన్ ప్రధాన ద్వారానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించారు.