: సోమాలియాపైనా ’ఉగ్ర’ పంజా!... రెస్టారెంట్ పై బాంబు దాడిలో 19 మంది మృతి


ఓ వైపు పలు దేశాల్లో ఐఎస్ ఉగ్రవాదులు భీకర దాడులు చేస్తోంటే, వారికి కొత్తగా ‘షిబాబ్’ పేరిట రంగప్రవేశం చేసిన మరో ఉగ్రవాద సంస్థ తోడైంది. ఆఫ్రికా పేద దేశం సోమాలియాపై షిబాబ్ ముష్కరులు మెరుపు దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదీషులోని ఓ రెస్టారెంట్ పై నిన్న రాత్రి ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. రెస్టారెంట్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు భోజనం చేస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిలో 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలే అధికులని ఆ దేశ పోలీసులు చెప్పారు. దాడిపై వేగంగా స్పందించిన పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో నలుగురిని మట్టుబెట్టిన పోలీసులు ఓ ముష్కరుడిని సజీవంగా పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News