: డీఎస్సీ నియామకాలపై కోర్టుల్లో కేసులు ఓ కొలిక్కి వచ్చాయి: మంత్రి గంటా


సంవత్సరం నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్న ఏపీ అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ నియామకాలపై కోర్టుల్లో కేసులు ఓ కొలిక్కి వచ్చాయని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 8,806 పోస్టుల భర్తీకి సాధారణ పరిపాలన శాఖ అనుమతి ఇచ్చిందని మంత్రి వివరించారు. మిగిలిన పోస్టులపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు గంటా వెల్లడించారు.

  • Loading...

More Telugu News