: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త... పీఎఫ్ నిధిపై పెరగనున్న వడ్డీ!


ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధిపై ఈ సంవత్సరం వడ్డీ పెరగనుంది. గత సంవత్సరం పీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే మొత్తంపై 8.75 శాతం వడ్డీ లభించగా, ఈ సంవత్సరం అది 8.95 శాతానికి పెరగవచ్చని సమాచారం. ఈ మేరకు ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఫైనాన్స్ కమిటీ సిఫార్సులు తయారు చేసినట్టు ఉన్నతాధికారుల సమాచారం. ఈ సిఫార్సులను సెంట్రల్ బోర్డు ట్రస్టీలు ఆమోదిస్తే, ఆపై ఆర్థిక శాఖా మంత్రి టేబుల్ పైకి దస్త్రాలు వెళతాయి. కాగా, 2010-11లో అత్యధికంగా 9.5 శాతం పీఎఫ్ వడ్డీ రేటును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో గత మూడేళ్లూ వడ్డీ తగ్గుతూ వచ్చింది. ఈ సంవత్సరం తిరిగి పెంచాలన్న నిర్ణయం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులందరికీ లాభదాయకమే.

  • Loading...

More Telugu News