: కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు బెయిలు మంజూరు


కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బెయిలు మంజూరైంది. విష్ణుతో పాటు సోదరుడు మల్లాది శ్రీనివాసరావుకు కూడా కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులతో విజయవాడలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు బెయిలు ఇచ్చింది. వారానికి మూడురోజులు పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని, సిట్ విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. సంచలనం రేపిన కల్తీ మద్యం వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు మొదట కొన్ని రోజులు విచారించిన సిట్ అధికారులు అనంతరం ఈ నెల మొదటివారంలో వీరిని అరెస్టు చేశారు. దాంతో విష్ణుకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన దరఖాస్తు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ రెండుసార్లు వాయిదా పడింది. చివరికి కోర్టు ఇవాళ బెయిలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News