: సీఎంగారి బోణీ... ఆ షోరూంకు కలిసొచ్చింది!


పలు దుకాణాల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు వెళ్లటం పరిపాటే. అదే ఏకంగా సీఎం వెళ్లి, స్వయానా చీర కొంటే? ఇంకేముంది, ఆ దుకాణం ఇట్టే ఫేమస్ అయిపోదూ! ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దావణగెరెలో ఓ షోరూంను ప్రారంభించారు. అంతేకాదు, రూ.లక్షకు పైగా పెట్టి ఓ ఖరీదైన పట్టుచీర కూడా కొన్నారన్నది అందరికీ తెలిసిందే. పైగా, ఆ రోజు ఆయన కొన్నది వాటర్ ప్రూఫ్ చీర అట. దాంతో కొనేముందే నీళ్లల్లో నానబెట్టి, నాణ్యతను పరిశీలించి, సంతృప్తి చెందాకే సీఎం ఆ చీరను కొన్నారట. కాషాయ, బంగారు రంగు కలగలిపి ఎంతో అందంగా తయారుచేసిన ఆ చీరను సిద్ధరామయ్య తన భార్యకు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మాకు కూడా అలాంటి చీరలే కావాలని పలువురు కొనుగోలుదారులు ఆ షోరూం వాళ్లని అడుగుతున్నారట. దాంతో ఆ షోరూంకు అమ్మకాలు తెగ పెరిగిపోయాయట. మొత్తానికి సీఎంగారి బోణీ బేరం షోరూంకు బాగా కలిసొచ్చిందని అంతా అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News