: వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన మరో బాలీవుడ్ జంట
బాలీవుడ్ లో మరో సినీ జంట తమ 15 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. నటుడు, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్, ఆయన భార్య అధునా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, పిల్లల పెంపకం విషయంలో మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అక్తర్, అధునా ప్రకటించారు. హుందాగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని, దయచేసిన తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. గతకొంత కాలం నుంచి ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయని, అవి విడాకులకు దారి తీసాయని సమాచారం. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అయిన అధునా బబానీకి అక్తర్ తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అక్తర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'దిల్ చాహ్ తా హై'కు ఆమె హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేశారు. దాంతో ఆమెకు ఎంతో పేరు లభించింది.