: హైదరాబాద్ వర్శిటీలో మరో వివాదం... నెట్, వైఫై ఆపివేయించిన అధికారులు!


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇంటర్నెట్, వైఫై సేవలను నిలిపివేయడంతో పాటు లైబ్రరీని మూసివేయడంతో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే రోహిత్ ఆత్మహత్య తరువాత పరిస్థితులు ఉద్రిక్తం కాగా, తమ ఆందోళనను అడ్డుకునేందుకు, స్వేచ్ఛను హరించేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్శిటీ అధికారులను అడిగితే, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇంటర్నెట్ ను తొలగించాల్సి వచ్చిందని చెప్పారని విద్యార్థులు చెబుతున్నారు. వీసీ అప్పారావు కావాలనే తమను అణచివేయాలని చూస్తున్నారని, విద్యార్థుల మధ్య చర్చలు జరగకుండా చూసేందుకే నెట్ సేవలను నిలిపివేయించారని విమర్శించారు. వర్శిటీ ఉన్నతాధికారుల కుయుక్తులతో తమ పోరును ఆపలేరని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News