: గ్రేటర్ ఎన్నికల తుది జాబితా ప్రకటించిన జీహెచ్ఎంసీ... బరిలో 1,333 మంది


గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను జీహెచ్ఎంసీ ఇవాళ ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపింది. అత్యధికంగా జంగంమెట్ లో 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆ తరువాత సూరారం-21, తూర్పు ఆనంద్ బాగ్-18, రామాంతపూర్ -17, చైతన్యపురి-16, మల్లాపూర్-14 మంది పోటీలో ఉన్నారు. ఇక అత్యల్పంగా చందానగర్ లో నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా పార్టీల వారీగా బీఫారాలు అందుకున్న వారి జాబితా చూస్తే, టీఆర్ఎస్-150, కాంగ్రెస్-150, టీడీపీ-96, బీజేపీ-66, ఎంఐఎం-60, బీఎస్పీ-56, లోక్ సత్తా-26, సీపీఎం-22, సీపీఐ-21, ఇతర పార్టీలు-49 మంది ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 636 మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News