: అవధాన కర్త గరికపాటికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం
ప్రముఖ అవధాన కర్త గరికపాటి నరసింహారావుకు లోక్ నాయక్ ఫౌండేషన్ వారు జాతీయ సాహితీ పురస్కారం ప్రకటించారు. దాని కింద రూ.1.50 లక్షల నగదు బహుమతి అందజేయనున్నట్టు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. అంతేగాక రైల్వే కార్మిక సంఘం నేత చలసాని గాంధీకి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనున్నట్టు యార్లగడ్డ వివరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు, నటుడు బ్రహ్మానందం, ఎంవీవీఎస్ మూర్తి హాజరవుతున్నారని పేర్కొన్నారు.