: మంత్రి కామినేని నిర్ణయాన్ని అభినందిస్తున్నాం: ఎంపీ గోకరాజు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇవాళ మోకాలి ఆపరేషన్ చేయించుకోవడాన్ని ఎంపీ గోకరాజు గంగరాజు మెచ్చుకున్నారు. ఈ ఉదయం ఆయన జీజీహెచ్ ను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోకరాజు మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కలిగించే విధంగా మంత్రి కామినేని తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. కామినేని స్పూర్తితో భవిష్యత్తులో తాము కూడా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటామని ఎంపీ పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో వైద్యశాఖ మరింత ముందుకెళుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.