: దిగొచ్చిన హెచ్ సీయూ వీసీ అప్పారావు... విద్యార్థులతో నేడు చర్చలు


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో నిరసనలతో హోరెత్తుతున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎట్టకేలకు చర్యలు మొదలయ్యాయి. తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని దాదాపు 14 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నా, ఆ వైపు కన్నెత్తిచూడని వీసీ అప్పారావు ఎట్టకేలకు మెట్టు దిగారు. నిన్న సాయంత్రమే వర్సిటీ పాలక మండలితో అత్యవసర భేటీ నిర్వహించిన ఆయన నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ఇక ఆందోళనలు కొనసాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు కూడా ఆయన సిద్ధమయ్యారు. నేడు విద్యార్థులతో ఆయన చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలకు రావాలంటూ విద్యార్థులకు వీసీ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఆందోళనలు విరమించేది లేదని తేల్చిచెబుతున్న విద్యార్థులు చర్చలకు ఏ మేర సహకరిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News