: పశ్చిమగోదావరి జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు... ఓ వ్యక్తి మృతి, గ్రామంలో ఉద్రిక్తత


గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పత్తికోళ్లలంకలో నిన్న రాత్రి పాతకక్షలు భగ్గుమన్నాయి. చేపల చెరువుల విషయంలో గ్రామ మాజీ సర్పంచ్ మహాలక్ష్మి రాజు, దళితులకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తమకు చెందిన చేపల చెరువులను కూడా మహాలక్ష్మిరాజు ఆక్రమించుకున్నాడని గ్రామ దళితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఇరువర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి మహాలక్ష్మి రాజు వర్గం తన ప్రత్యర్థి వర్గంపై మూకుమ్మడి దాడి చేసింది. ఈ దాడిలో కొండలు అనే వ్యక్తి చనిపోయాడు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. గొడవలకు కారణంగా భావిస్తున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు పునరావృతం కాకుండా 144 సెక్షన్ ను విధించారు.

  • Loading...

More Telugu News